అరవింద్ కేజ్రీవాల్ అనే యువకుడు కొంతకాలంగా జాతీయ వార్తల్లో చాలా ప్రముఖంగా కనిపిస్తున్నాడు. ఇంతకుముందు సమాచార హక్కు కార్యకర్తగా అప్పుడప్పుడు వార్తల్లో కనిపించిన ఈ మాజీ కేంద్రప్రభుత్వోద్యోగి అన్నా హజారే చెప్పుల్లో కాళ్ళు పెట్టిన తర్వాత చూస్తుండగానే జాతీయ వార్తల్లో వ్యక్తిగా ఎదిగిపోయాడు. అన్నా హజారే కు లేని సౌలభ్యం ఒకటి ఇతనికుంది. అది, ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడగలగడం. దక్షణ భారతీయుల దృష్టికి ఎవరైనా జాతీయ వ్యక్తిగా ఆనాలంటే, అతడు ఢిల్లీ చుట్టు పక్కల ఉంటూ ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలిగి ఉంటే చాలు. ఎందుకంటే దక్షణ భారతీయులు జాతీయస్థాయి వార్తలను, వ్యాఖ్యలను తెలుసుకోడానికి ప్రధానమైన సాధనాలు ఆంగ్ల పత్రికలు, ఢిల్లీ నుంచి పనిచేసే ఇంగ్లీష్ వార్తా చానళ్లే. మిగిలిన రాష్ట్రాల సంగతేమోకానీ ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు పత్రికలు, చానెళ్లు 'ప్రాంతీయ పార్టీ'లుగా మారిపోయాయి. ఇక్కడ చంద్రబాబు పాద యాత్ర, జగన్ అక్రమాస్తులు, రాంచరణ్ తేజ్ పెళ్లి ఏర్పాట్లు, ఇంకో తార నిశ్చితార్థం వగైరాలే ప్రధాన వార్తలు.
అరవింద్ కేజ్రీవాల్ లానే ఇంగ్లీష్ దంచి మాట్లాడగలిగిన కిరణ్ బేడి, ప్రశాంత్ భూషణ్ లాంటి మరికొందరు హజారేకు ఇంగ్లీష్ గొంతుగా మారి ఈ మధ్య ఢిల్లీ ఎత్తున చాలా హడావుడి చేశారు. హజారే మరాఠీ హృదయానికి సరైన టీకా టిప్పణి అందించడంలో వీళ్లు ఎక్కడ విఫలమయ్యారో కానీ మధ్య మధ్య ఆయనకూ వీళ్ళకూ మధ్య అపోహలకు సంబంధించిన వార్తలూ వస్తూనే ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనుకోవడంతో దూరం మరింత పెరిగినట్టు వార్తలు వచ్చాయి. అదేమీ లేదనీ, అన్నా అడుగుజాడల్లోనే నడుస్తున్నామనీ, ఆయన ఆశీస్సులు మాకున్నాయనీ ప్రకటించిన కేజ్రీవాల్ అన్నా టోపీతో 'అరవింద్ అన్నా కేజ్రీవాల్' అవతారం కూడా ఎత్తాడు.
అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం రాజకీయేతర స్వభావంతో ప్రారంభమైందని మనకు తెలుసు. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో అది జనాన్ని ఆకట్టుకుని విశేష ప్రచారాన్ని పొందగలిగింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం అవినీతిపై నిష్క్రియత్వాన్నిసాగదీస్తోందని, అవినీతిపరులకు గొడుగు పడుతోందనే భావన ఒకవైపు; ప్రభుత్వాన్ని దారికి తేగల నైతికబలం బీజేపీ సహ ప్రతిపక్షాలలో లోపించిందన్న భావన ఇంకో వైపు జనం ముందు ఒక రాజకీయ శూన్యాన్ని ఆవిష్కరించాయి. దాంతో రాజకీయేతరంగా కనిపించిన అన్నా ఉద్యమం ఆ జాగాను సునాయాసంగా భర్తీ చేసింది. అయితే క్రమంగా అదీ దారి తప్పుతున్న సూచనలు కనిపిస్తూ వచ్చాయి. ఉదాహరణకు, పటిష్ట లోకపాల్ అవసరాన్ని ఎత్తి చూపించి, దానికి అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి పరిమితం కావలసిన ఉద్యమం నిర్దిష్ట ఫలితం కోసం పట్టుబట్టి ప్రభుత్వంతో పంతానికి పోయింది. ఆ విధంగా ప్రభుత్వం జాగాలోకి దురాక్రమణ చేయబోయింది. అలాగే రాజకీయేతరం అనుకున్నది కాస్తా రాజకీయ ధ్వనులు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా అవినీతి ఆరోపణల వెల్లువలో యూపీఏ ప్రభుత్వం మునగానాం తేలానాం గా ఉన్న పరిస్థితిని రాజకీయ రాజమార్గంలో సొమ్ము చేసుకోవడంలో బీజేపి విఫలమవుతున్న దశలో అన్నా టీం 'ప్రచ్చన్న'బీజేపీ లా తెర మీదికి వచ్చిందన్న అనుమానం జనంలో బలపడుతూ వచ్చింది. అది వాస్తవమా కాదా అన్నది వేరే విషయం. అటువంటి అనుమానాలకు తావివ్వకుండా ఉద్యమం నడపడంలో అన్నా టీం విఫలమైంది. హిస్సార్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగడం ఉద్యమంపై జనస్పందనను మరింత పలచన చేసింది. ఉద్యమంలో చేరిన ఇంగ్లీష్ కోతులు ఢిల్లీ వేదికపై కిష్కింధ కాండను సృష్టిస్తుంటే, పాపం ఇంగ్లీష్ రాని అన్నా హజారే ఏమీ అనలేక, ఏమనాలో తోచక ఇరకాటంలో పడిపోయాడు.
భారత రాజకీయాలు, ముఖ్యంగా అవినీతి ఆరోపణల్లాంటి విషయాలు సాధారణంగా ఇదిగో పులి అంటే అదిగో తోక అనే పద్ధతిలో సాగుతూ ఉంటాయి. అనుమానాల పులినీ, తోకనూ సృష్టించి అవతలి వాళ్ళను డిఫెన్స్ లో పడేయడానికీ, సాధ్యమైనంత వాక్కాలుష్యాన్ని వ్యాపింపజేయడానికీ దాదాపు అన్నీ రాజకీయ పక్షాలూ కొంతమందిని బరి లోకి దింపుతుంటాయి. కాంగ్రెస్ లో కొంతకాలంగా దిగ్విజయ్ సింగ్ ఆ పాత్రనే దిగ్విజయంగా పోషిస్తున్నాడు. చటుక్కున స్ఫురించే మరో పేరు అమర్ సింగ్. ఉద్యమాన్నిలాఫింగ్ స్టాక్ గా మార్చే ఢిల్లీ కోతుల కిష్కింధ కాండను కాకలు తీరిన కాంగ్రెస్ శ్రేణులు వాటంగా వాడుకున్నాయి. ఆ విద్యలో అనుభవమూ, నేర్పూ లేని అన్నా బృందం డిఫెన్స్ లో పడింది. ఉద్యమం చింపిన విస్తరి అయ్యే ప్రమాదం ప్రతి దశలోనూ కనిపించింది. అన్నా క్రమంగా దూరంగా జరుగుతూ రావడంతో అన్నా బృందానికి ఉద్యమం పులి మీద స్వారీగా మారింది. దానిని వెనకటి రాజకీయేతర స్వభావానికి మళ్లించే అవకాశం ఇప్పుడు లేదు. తీసుకెళ్లి రాజకీయ వైతరణిలో ముంచడం ఉన్నంతలో సులభోపాయం. అరవింద్ అండ్ కో చేసింది అదే.
ఉద్యమాన్ని ప్రారంభించడమే కాదు, దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో, ఎలా నిలబెట్టాలో, ఎక్కడ ఆపాలో కూడా తెలియాలి. అది లోపించడమే అన్నా ఉద్యమాన్ని నీరు గార్చింది. అందువల్ల వ్యక్తులకు జరిగే నష్టం కన్నా ఉద్యమానికి జరిగే నష్టం ఎక్కువ. అవినీతికి వ్యతిరేకంగా ఇకముందు ఉద్యమించేవారెవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి వస్తుంది. పటిష్ట లోక్ పాల్ నినాదంతో అన్నా ఉద్యమం ముందుకొచ్చింది. జనంలో ఆ స్పృహ కలిగించడం వరకే అది చేయవలసింది. ఆ తర్వాత జనమే దానిని సాధించుకుంటారు. ప్రభుత్వం మీద సూపర్ ప్రభుత్వం జనమే. కనుక అన్నా ఉద్యమం అడ్రస్ చేయవలసింది జనాన్ని. అందుకు భిన్నంగా అది ప్రభుత్వాన్ని అడ్రస్ చేయడం ప్రారంభించింది. తనే సూపర్ ప్రభుత్వంలా వ్యవహరించబోయింది. ప్రభుత్వంతో ఘర్షణకు దిగింది. ప్రభుత్వం జాగాలోకి చట్టవిరుద్ధంగా అడుగుపెట్టడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఎలాంటి ప్రభుత్వమైనా ఊరుకోదు. మీడియా కూడా అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏదో ఒక సామాజికాంశాన్ని తలకెత్తుకుని పోరాడడం వ్యక్తులు, సంస్థల స్థాయిలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే, సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన ప్రక్రియ కూడా మా చేతుల మీదుగానే జరగాలని, మేము చెప్పినట్టే ప్రభుత్వం చేయాలనీ వ్యక్తులు, సంస్థలు పట్టుబట్టిన ఉదాహరణలు లేవు. అన్నా టీం అదే చేయబోయింది.
అదీగాక 'అవినీతికి వ్యతిరేకంగా' ఉద్యమించడంలోనే పెద్ద అవగాహనా లోపం ఉంది. దేశంలో అవినీతి కచ్చితంగా ఉంది, లేదని ఎవరూ అనరు. సమస్యేమిటంటే, అవినీతి పరిమాణం ఎంతో మనకు తెలియదు. టూ జీనే తీసుకుంటే ఖజానాకు వచ్చిన నష్టం లక్షా డెబ్భై వేల కోట్లనీ, అరవై వేల కోట్లనీ, ముప్పైవేల కోట్లనీ(అది కూడా ఊహాప్రాయమైన నష్టమనీ)...రక రకాల లెక్కలు వినిపించారు. అంతే కాదు, అవినీతి ఉందని అంతా అనుమానించే చోట నిజంగా ఉండకపోవచ్చు. అనుమానించని చోట ఆశ్చర్యకరమైన ప్రమాణంలో ఉండచ్చు. అవినీతి లోతు, వ్యాప్తి నికరంగా తెలియక పోవడం అవినీతిని మించిన సమస్య. కనుక పరిపాలనలో పారదర్శకత ఒక్కటే అవినీతికి విరుగుడు. అన్నా ఉద్యమమైనా, మరొకటైనా డిమాండ్ చేయవలసింది పారదర్శకతను తీసుకు రావాలనే! లోక్ పాల్ అవినీతిని శిక్షించడానికి అవసరం కావచ్చు, అంతకంటే ముందు అవినీతికి అవకాశాలను కనిష్ట స్థాయికి తగ్గించడానికి పారదర్శకతే సాయపడుతుంది. యూపీఏ ప్రభుత్వంలో జరిగిన పొరపాటు అదే. మీడియా గతంలో లేనంత వ్యాప్తినీ, క్రియాశీలతనూ సంతరించుకుని కెమెరాను నేరుగా ప్రభుత్వ శాఖల్లోకి ఫోకస్ చేస్తోందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గమనించలేకపోయింది. తనే తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం అంతఃపుర కుట్రలను కూడా బట్టబయలు చేయగలదన్న వాస్తవాన్ని విస్మరించింది. ప్రజల అవగాహనలో సమూలమైన మార్పు వస్తున్న సంగతిని పసిగట్టలేకపోయింది. అన్నిటినీ కార్పెట్ కిందికి తోసేసే అధికార రహస్యాల సంస్కృతినీ; చట్టాన్నీ, సాంకేతికాంశాలనూ అడ్డుపెట్టుకుని తప్పించుకునే ధోరణినీ పట్టుకుని వేళ్లాడుతూ వచ్చింది. అవినీతి ఆరోపణలపై చర్యలో ఇంతకాలం అలవాటుపడిన దాటవేసే ధోరణినే మొండిగా బండగా సాగదీసింది. ఆ విధంగా ప్రభుత్వంపై జనంలో ఏర్పడిన అవిశ్వాసం, ప్రతిపక్షాల నిర్వీర్యత కలసి ఒక రాజకీయ శూన్యాన్నిసృష్టించాయి. అన్నాఉద్యమంపై తొలి విశేష స్పందనకు కారణం, ఆ శూన్యాన్ని అది కొంతవరకు కళ్ళకు కట్టించగలగడమే.
అలాంటి ఉద్యమం తను కూడా వెళ్ళి వెళ్ళి అదే రాజకీయ గంగలో మునగాలని నిర్ణయించుకోవడం 'పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్' అనడానికి చక్కని ఉదాహరణ. రాజకీయపక్షం అన్నాక అది అమలులో ఉన్న రాజకీయ పద్ధతులను, గ్రామర్ ను అనుసరించక తప్పదు. కింది స్థాయికి వెడుతున్న కొద్దీ ఆదర్శాలు పలచబారి అమాంబాపతు పార్టీలలో ఒకటిగా మారిపోవచ్చు. మన రాష్ట్రంలో లోక్ సత్తా పార్టీనే చూడండి. జయప్రకాష్ నారాయణ్ రాజకీయ స్వచ్చతపట్ల ఎంత అంకితభావాన్ని చాటుకుంటున్నా, ఆ పార్టీకి ఎంతో కొంత మద్దతు ఉంటుందనుకునే హైదారాబాద్ నగరంలోనే ఆ మధ్య కార్పొరేషన్ ఎన్నికలలో జనసమీకరణకు వాహనాలు, డబ్బు ఉపయోగించిన సంగతి ఆయన దృష్టికి వెళ్ళి ఉండక పోవచ్చు. రేపు అరవింద్ 'అన్నా' కేజ్రీవాల్ పార్టీ కూడా ఇలాగే పరిణమించడంతోపాటు ఏ ప్రధానపక్షానికో చెలికత్తెగా మారినా ఆశ్చర్యంలేదు. రాజకీయపక్షాలను, రాజకీయకార్యాచరణను తృణీకరించడం ఇక్కడ ఉద్దేశం కాదు. రాజకీయ రుగ్మతలను ఎత్తి చూపిస్తూ, దానికి ముక్కు తాడు వేసే ప్రయత్నం రాజకీయేతరంగా జరుగుతూనే ఉండాలనీ, అందుకు తగిన జాగాను సమాంతరంగా అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలనీ చెప్పడమే.
ఏమైతేనేం, కాంగ్రెస్ జాతకం బాగున్నట్టుంది. దాదాపు రెండేళ్లుగా అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరవుతూ, నిష్క్రియతను చిత్తగించిన యూపీఏ ప్రభుత్వం క్రమంగా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ప్రజాజీవితంలో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవనడానికి మరో ఉదాహరణ కాబోయే మార్గాన్ని అన్నా ఉద్యమం ఎంచుకోవడం కూడా అందుకు ఒక కారణం అనడంలో ఆశ్చర్యం లేదు.

కేజ్రీవాల్ అచ్చున్నత స్తానం లో పని చేసిన ఉద్యోగి (Ex IRS ) అంతే కాకుండా IIT student. ఇవి అన్ని అతని మీద నమ్మకం కలిగిస్తుంది. ఈయన్ను మన తెలుగు జయ ప్రకాష్ నారాయణ ( Ex IAS) తో పోల్చవచ్చు
ReplyDeleteమీ మాటలు, విస్లేషణలు చూస్తుంటే ఓ పద్యం గుర్తుకొస్తోంది.
ReplyDeleteప్రారభించరు నీచ మానవుల్...
మనం చేయము, ఇంకోడు చేస్తోంటే తొక్కలో లాజిక్కులు తీసి కాలడ్డె ప్రయత్నాలు చేస్తుంటారు కొందరు. కాంగ్రెస్ మీద పడి ఏడుస్తుంటాం కాని కాంగ్రెస్స్ అవినీతికి వ్యతిరేకంగా ఎవరో వస్తే శతకోటి అనుమానాలు, కుళ్ళు ఆలోచనలు. అలా వచ్చినోళ్ళను దుమ్ము నాకించేంతవరకూ నిద్రపట్టదు. 'ఈ బ్రతుకులు బాగుపడవు, ఈ జన్మకింతే ' అనే రాజీ మనస్థత్వం.
"పార్లమెంటే సుప్రీము, పార్లమెంటులో బలమున్న అవినీతి నేరస్థులదే మాట" అన్న కాంగ్రెస్, బిజెపి, ఎస్పి ల చాలెంజికి ఓ విద్యాశాలి అయిన కడుపుమండిన యువకుడు సరే మీ బరిలోకే దిగుతాము అని తీసుకున్న చాలెంజిని వక్ర భాష్యాలతో నీరుకార్చేదాకా మనకు నిద్ర పట్టదు. అన్ని రాజకీయ పార్టీలను అవినీతి చట్రంలో బిగించడానికి తాపత్రయ పడిపోతాం. ఒక వేళ అది నిజమైతే, " చాశావా, నే చెప్పింది నిజమైంది, నేనెప్పుడో విస్లేషణ చేశాను" అని సంతోషించే తుచ్చ మనస్థత్వం. అన్నాది "మురికి రాజకీయాల్లో దిగము" అన్న సిద్ధాంతం కావచ్చు. అరవింద్ ది యుద్ధాన్ని మీ దగ్గరికే తీసుకువస్తాము అన్న చైతన్యం, అని ఎందుకనుకోరు?
He may fail at the most, but it is a struggle in right direction even if he fails. When we can have so many corrupt political parties, how it matters if one more is added to that?!! It is a sick mentality, to speculate that he will join them, he may join strategically, but... but his fighting spirit should be appreciated. If he can't beat them, he would lose confidence of the people that is obvious. Let him fight. If I can't fight, I feel I should support those who fight, let it be JP, Hazare, Kejri or some Tom, Dick & Harry. As on today, I am convinced that they are right in their approach, though they look a bit different.
ReplyDelete/I guess we are part of this 'corruption' game. Unless people change, system won't change how many ever laws we bring./
ReplyDeleteThere is a need of external force, to change the present state of inertia. I think, some are trying to change this slumber/inertia. If we can't encourage/help them it is fine, but shouldn't put spoke in their effort, right?
IAC members were failed in their initial efforts, they were jailed for raising voice against corruption. They were challenged & chided openly by the congress ministers to face them in elections. They snubbed him saying "Parliament( with 25% criminal members) is supreme" The young guy had no option than to take up the challenge.
He may win or loose that depends on support of the people. No option than to give them a chance, having seen Congress, BJP, SP, BSP etc., if right minded people are for a change. Otherwise, fine we have corrupt Congress/BJP to continue.