Monday, December 17, 2012

తెలుగు సభల్లో 'తెలుగు బహిర్భూమి' గురించి చర్చిస్తారా!?


 గాంధీజీ తర్వాత పారిశుద్ధ్యం గురించి మాట్లాడిన/మాట్లాడుతున్న నాయకులు ఎవరైనా ఉన్నారా అని ఒక బ్లాగులో ప్రశ్నించాను. అప్పుడు నాకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జై రామ్ రమేశ్ పేరు గుర్తురాలేదు. పూర్తిగా పారిశుద్ధ్యం గురించి కాకపోయినా, దానితో సంబంధమున్న వ్యక్తిగత మరుగుదొడ్ల  అవసరం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య మీడియా దృష్టిని  ప్రముఖంగా ఆకర్షించాయి. హర్యానాలో కాబోలు మాట్లాడుతూ, 'వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం లేని ఇంటికి ఆడపిల్లను ఇవ్వ'ద్దని ఆయన సలహా ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో అదే వ్యాఖ్యను పునరుద్ఘాటించారు. ఆ సందర్భంలోనే  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ఏకరవు పెట్టిన వివరాలను ఆయన బహిరంగంగా తీసిపారేసినట్టు వార్త వచ్చింది. 'మీ ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉందా అని  అనంతపురం జిల్లాలో పదిమంది మహిళలను అడిగితే, లేదని ఏడుగురు మహిళలు జవాబిచ్చా'రని ఆయన చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండడాన్ని అభివృద్ధికి  ఒక సూచిగా నొక్కిచెప్పినందుకు ఆయన అభినందనీయుడు.

వ్యక్తిగత మరుగుదొడ్లకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో ఎప్పటినుంచీ ప్రచారం జరుగుతోందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతో తలమునకలవుతారు. ఎప్పుడో వందేళ్ల క్రితమే వ్యక్తిగత మరుగుదొడ్డి అవసరాన్ని కందుకూరి వీరేశలింగంగారు ఒక నవలలో(సత్యవతీ చరిత్రము?) ప్రబోధించారు. స్వాతంత్ర్యోద్యమం రోజుల్లో కమ్యూనిష్టులు కూడా పారిశుద్ధ్యం అవసరాన్ని ప్రచారం చేసేవారని మహీధర రామమోహన రావు గారి నవలలు చదివితే అర్థమవుతుంది. అటువంటి కమ్యూనిష్టులు సైతం ఈ రోజున పారిశుద్ధ్యం గురించి మాట్లాడకపోవడం, ఉద్యమించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  పదేళ్ళ క్రితం రాష్ట్రంలో పాదయాత్ర జరిపిన ప్రముఖ నాయకుడు కానీ, ఇప్పుడు జరుపుతున్న ప్రముఖ నాయకుడు కానీ పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి, తమ ప్రసంగాలలో ప్రస్తావించిన  దాఖలాలు లేవు. శాసనసభలో ఈ అంశంపై ఇటీవలికాలంలో గట్టిగా చర్చ జరిగిన సాక్ష్యం కూడా లేదు. ఒకవేళ ఈ అభియోగాలు  తప్పని నిరూపించే  వివరాలు ఎవరైనా అందిస్తే వినమ్రంగా స్వీకరించడానికి నేను సిద్ధమే.

జై రామ్ రమేశ్ అభినందనీయుడే. అయితే ఆయన కూడా సమస్యను పాక్షికంగానే ప్రదర్శిస్తున్నారు. మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యం గురించే మాట్లాడుతున్నారు. రోడ్లు, నదీతీరాలు, కాలువగట్లు, చెరువుగట్లు  బహిరంగ పాయిఖానాలుగా మారిన దుస్థితినుంచి ఊళ్లను కాపాడాలంటే  వ్యక్తిగత మరుగుదొడ్డి ప్రతి ఒకరికీ అవసరమే. పిల్లలను, మగవారిని మినహాయించడానికి వీలు లేదు. అలాగే,  కుళ్లి కంపు కొట్టే చెత్త గుట్టల వంటి ఇతర పారిశుద్ధ్య సమస్యల గురించి ఆయన మాట్లాడుతున్నట్టు లేదు. నన్నడిగితే, అన్ని రాజకీయపక్షాల నాయకులూ  పాదయాత్ర కాకపోయినా, కనీసం నెలలో పది రోజులు ఊళ్లలో మకాం పెట్టాలంటాను. అప్పుడే ఊళ్ళు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, ఎలా తగలబడుతున్నాయో ప్రత్యక్షంగా అర్థమవుతుంది.

అన్నట్టు ఇంకో విషయం మీలో ఎంతమందికి తెలుసు?! కేంద్రంలో మంచినీరు, పారిశుద్ధ్యాలకు ఒక మంత్రిత్వశాఖ ఉందట. ఈ శాఖ కింద 1999లో 'టోటల్ శానిటేషన్ కేంపెయిన్'(టీసీఎస్) పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారట. దీనికి ఆ తర్వాత 'నిర్మల్ భారత్ యాత్ర' అని పేరు మార్చారట. 1999-2012 మధ్యకాలంలో ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 81, 96, 510 మరుగుదొడ్లు నిర్మించారట. వీటిలో 80, 755, 08 వ్యక్తిగత మరుగుదొడ్లట. 962 మాత్రమే సాముదాయిక మరుగుదొడ్లట. ఈ పథకంలో భాగంగా స్కూళ్ళలో కూడా మరుగుదొడ్లను నిర్మించారట. అయితే, వాటికి చాలా చోట్ల తాళం వేయడమో లేదా టీచర్లు వాడుకోవడమో జరుగుతోందట. ఈ సంవత్సరాంతానికి నూటికి  నూరుశాతం గ్రామాలలోనూ మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని నిర్ణయించుకున్న లక్ష్యం. మన రాష్ట్రంలో ఇప్పటికీ 67 శాతం మేరకే కృతకృత్యులయ్యారని లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవంగా ఊళ్లలోకి వెళ్ళి చూస్తే ఈ పథకం అమలుకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించవు. అసలు అలాంటి పథకం ఉన్నట్టే చాలామందికి తెలియదు. పథకం గురించి ప్రచారం పూర్తిగా లోపించిందని దానిని సమీక్షించిన పండితులు పెదవి విరుస్తున్నారు.  నేను ఇటీవల వెళ్ళిన ఒక ఊళ్ళో నిర్మల్ గ్రామ్ పురస్కార్ అని రాసి ఉన్న ఒక బోర్డు కనిపించింది. బహిరంగ కాలకృత్యాలు నిషిద్ధమనీ, ఉల్లంఘిస్తే శిక్షించబడతారనీ దానిమీద రాసి ఉంది. విచిత్రమూ విషాదమూ ఏమిటంటే ఆ బోర్డుకు దగ్గరలోనే యథేచ్ఛగా బహిరంగ కాలకృత్యాలు జరుగుతున్నాయి.

ఈ నెల 27 నుంచీ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. ఆ సభల్లో తెలుగు సంస్కృతీ, సాహిత్యాలు, చరిత్ర గురించి మహోద్ఘాటనలు ఎలాగూ జరుగుతాయి.  300 మంది కవి రచయితలను ఆహ్వానిస్తున్నట్టు ఇప్పటికే వార్త. కానివ్వండి.  అదే సమయంలో ఆంధ్రరాష్ట్రం అంతా ఒక పెద్ద బహిర్భూమిగా మారిన సంగతిని ఆ మహాసభల్లో చర్చకు పెడతారా? దాని ప్రక్షాళన దిశగా తీర్మానం చేస్తారా??

పారిశుద్ద్య సమస్యతోపాటు పోషకాహారలోపమనే మరో సమస్యకూడా తెలుగు ఊళ్లను చెదపురుగులా తొలిచివేస్తోంది. దాని గురించి మరోసారి....

(సంబంధిత బ్లాగులు: 1. గోదావరి జిల్లాలను కడగడానికి ఎన్ని టీ.ఎం.సీల ఫినాయిల్  కావాలి?  2. తెలుగు భాషనే కాదు, తెలుగు ఊళ్ళనూ రక్షించుకోవాలి  3. ఎందుకొచ్చిన హైదరా'బాధ' ఇది?)

తాజా కలం:  'అన్ని రాజకీయపక్షాల నాయకులూ నెలలో పదిరోజులు ఊళ్లలో మకాం పెట్టాలనీ, అప్పుడే ఊళ్ళు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, ఎలా తగలబడుతున్నాయో ప్రత్యక్షంగా అర్థమవుతుందనీ' పైన రాశాను. తర్వాత గుర్తొచ్చింది, హైదారాబాద్ పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదని. ఇక్కడ కూడా చెత్త, కుళ్లిన ఆహారపదార్థాలు రోడ్ల మీద పొర్లి ప్రవహిస్తూ పరిసరాలను దుర్గంధభూయుష్టం చేస్తూనే ఉన్నాయి. చెత్త పట్టికెళ్లే కార్పొరేషన్ వాహనాలు దుర్గంధాన్ని దారి పొడవునా మోసుకెడుతూ కొంత చెత్తను రోడ్డు మీద వెళ్ళే జనాల నెత్తిన కూడా వేసి పోతుంటాయి.  గార్బేజ్ లిఫ్టింగ్ లో నాగరిక పద్ధతులను అమలు చేయడం కాదు సరికదా, దానిని తీసుకెళ్లే వాహనాలకు కనీసం మూత వేయాలన్న స్పృహ కూడా లేని పరమ అనాగరిక, అసహ్య పాలన రాజధానిలో నడుస్తోంది. ఈ పరిస్థితిలో ఊళ్ళ గురించి చెప్పుకోవడం వల్ల కంఠశోష తప్ప ప్రయోజనం ఏముంటుందనీ అనిపించే మాట నిజం. అయినాసరే, రేపటి మీద ఆశతో సమస్యను అప్పుడప్పుడైనా గుర్తుచేసుకోకా తప్పదు.  

12 comments:

  1. మంచి విషయం ప్రస్తావించారు. మనదేశంలో శుభ్రతను కనీస స్థాయిలో మెరుగు పరిస్తే ప్రజలలో అభివృద్దిచెందాం అన కొత్త విశ్వాసం ఎర్పడుతుంది. పొద్దున లేచిన మొదలుకొని రాత్రివరకు మీడీయాలో, పేపర్లలో యువనేత జీవిత చరిత్ర,బాబు, షర్మిల నడక ఆరోపణలు ప్రత్యారోపణలు కవర్ చేస్తూనంత కాలం మన మీద మనకు విశ్వాసం ఏర్పడదు. ఆర్ధికంగా అభివృద్దిచెందిన వర్గాల వారు కూడా పేదవారిగా ఊహించుకొంటారు. అభివృద్ది,సౌకర్యాలు అంటే పాశ్చ్యత్య దేశాలు అనే గుర్తుకు వస్తుంటాయి.

    ఈ విడియోను తప్పక చూడండి. 20min

    http://www.youtube.com/watch?v=_T7qzufEI9U

    ReplyDelete
    Replies
    1. SRI RAM GARU,

      Thank you very much for providing a wonderful link. I have seen the video in its entirety and I very much wish to write about the Gentleman.

      Murugunatham is definetely a Great guy and he deserves a standing ovation in its true meaning.

      Delete
    2. శ్రీరామ్ గారూ...వీడియో చూశాక రెస్పాండ్ అవుదామనుకుని ఆలస్యం చేశాను. సారీ. మీరు చెప్పిన వీడియో ఇప్పుడే చూశాను. అంతమంచి వీడియోను సూచించినందుకు మీకు ధన్యవాదాలు. నిజంగా మురుగనాథన్ ప్రసంగం చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. నాకు చాలాకాలం తర్వాత ప్రముఖ రష్యన్ ఎడ్వంచరర్ కం ఫిలాసఫర్(పేరు స్పష్టంగా గుర్తురావడం లేదు. ఆస్ పెన్ స్కీ? అలాగే పుస్తకం పేరు కూడా) ఆ పుస్తకం నా దగ్గర ఉండాలి. మురగనాథన్ ప్రసంగం ఆ పుస్తకాన్ని గుర్తుచేసింది. అందులోని ఆసక్తికరమైన విషయాలను కొన్నింటిని నా బ్లాగ్ లో ఉంచడానికి ప్రయత్నిస్తాను. మీరు మురగనాథన్ ను బ్లాగ్ వీక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉంటుందేమో చూడండి. నిజంగా ఆలోచింపజేసే వీడియోను మీరు సూచించారు. మరోసారి థాంక్స్.

      Delete
  2. శివరామప్రసాదు కప్పగంతు గారూ...మీ సాహిత్యాభిమాని బ్లాగ్ కు నా స్పందనను ఉదయం 9.30 ప్రాంతం నుంచి, సాయంత్రం 3.30 ప్రాంతం వరకు విడతలవారీగా పంపించాను. మీరు చూసి ఉంటారనుకుంటున్నాను. కానీ ఇప్పటివరకు(రాత్రి 9.0 గంటలు) మీ బ్లాగులో అది కనిపించలేదు. మీకు అందినదీ లేనిదీ, ఎప్పుడు క్యారీ చేస్తున్నదీ తెలపగలరు.

    ReplyDelete
  3. పై మెసేజ్ లో నమోదైన టైమ్ చూసి కన్ఫ్యూజ్ అవకండి. నేను యూ.ఎస్ లో ఉండగా ప్రారంభించిన బ్లాగ్ కనుక అదే టైమ్ నమోదవుతోంది.

    ReplyDelete
  4. శివరామప్రసాదు కప్పగంతు గారూ, మీ సాహిత్యాభిమాని బ్లాగ్ లో మీ డిసెంబర్ 20 స్పందన తర్వాత దానిపై నా స్పందనను డిసెంబర్ 22,23 తేదీలలో పంపించాను. చూసి ఉంటారనుకుంటాను. ఇంతవరకు మీరు దానిని క్యారీ చేయలేదు.

    ReplyDelete
  5. శివరామప్రసాదు కప్పగంతు గారూ, మీడియాపై నేను అనని మాటలను అన్నట్టు ఆపాదిస్తూ మీరు చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోమని మరోసారి కోరుతూ; మీ ఇతర వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ మీ సాహిత్య అభిమాని బ్లాగ్ కు నా రెండవ స్పందనను డిసెంబర్ 22, 23 తేదీలలో, అనగా 20 రోజుల క్రితం పోస్ట్ చేశాను. ఆ స్పందనను మీరు క్యారీ చేయని సంగతిని 24 గంటల క్రితం గుర్తుచేశాను. ఇప్పుడు మరోసారి అదే చేస్తున్నాను. ఏమైనా సాంకేతికమైన ఇబ్బందులున్నాయా? నా దగ్గర హార్డ్ కాపీ ఉందనుకోండి. కాకపోతే మళ్ళీ కంపోజ్ చేయాల్సి వస్తుంది. స్పందించండి.

    ReplyDelete
  6. Kalluri Bhaskaram garu,

    I have posted your comments in my blog and waiting for others to react. That is why I have not updated any further article in my blog since then. Two people who are close to me responded and naturally their reaction is for me. In all fairness, I did not post those comments.

    Other comments if any from you I have not received. I also do not wish to receive any further comments also from you, as you are more combative than ready for dicussion. Whatever comments I made about Media is on the institution of the Media and not on any personalities, leave alone any comment on you personally. However, you have chosen to comment on me, my photo etc. in a very personaly way.

    Regarding what you are saying that you did not say. Main insppiration for my writing the article is in response to a separate post you created out of the comments made by me quoting my name in your blog. If you are not defending that media is quite impartial, you could have made a simple reply to my comment in the respective article itself as normally happens in Blogs.

    At one place in your comments in my blog, you said "...బీజేపీని ఒకే గాటన కట్టి దొందూ దొందే నంటూ మీ పార్టీకి మీరే డిస్సర్వీస్ చేస్తున్నారు..." Tell me where did I give even a slightest hint that BJP is my party! Just because I am critical of one party, does it automatically mean that I am "for" another party diametrically opposite to it. It cannot be. In a democracy, normal people do not have any political leanings but vote according to their liking or disliking of the party at that moment. Keeping both the parties on par is not an enough proof of my impartiality in the matter.

    OK. Whatever has happened has happened and since you are strongly feeling that I should not have referred to you in my article in my blog, I shall remove the introductory part. Can you also remove my name in one of your posts.

    You may see the articles I had written in my Blog on Media and more especially about AD Mafia which is making the media the way what it is rather than what the readers/viewers want the media to be. You can share your views so that whatever bad happening in media can be highlighted and try as we can to atleast voice our protest and annoyance at such things. In case you wish to contact me, you can see my e mail address is in my profile.

    ReplyDelete
  7. శివరామప్రసాదు కప్పగంతుగారూ,
    డిసెంబర్ 22,23 తేదీలనాటి నా స్పందనను మీ సాహిత్య అభిమాని బ్లాగ్ లో క్యారీ చేస్తారని 20 రోజులపాటు ఎదురుచూశాను. మీ ప్రత్యుత్తరం తయారుచేసే ప్రయత్నంలో ఆలస్యం చేస్తున్నారనుకున్నాను. అటువంటిది మీ నుంచి ఇలాంటి స్పందనను ఊహించలేదు. చాలా నిరాశపరిచారు. మళ్ళీ పాయింట్ బై పాయింట్ గా నా స్పందనను తెలియజేస్తున్నాను.
    1."Other comments if any from you I have not received..." నేను డిసెంబర్ 19వ తేదీన మీ సాహిత్య అభిమాని బ్లాగ్ కు పోస్ట్ చేసిన స్పందనను మీరు క్యారీ చేశారు, నిజమే. దానిపై మీ ప్రతిస్పందనను పురస్కరించుకుని డిసెంబర్ 22,23 తేదీలలో నా స్పందనను మీ సాహిత్య అభిమాని బ్లాగ్ కు పోస్ట్ చేశాను. అది మీకు చేరలేదని మీరన్న పై మాటలు చెబుతున్నాయి. సాంకేతికంగా ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడంలేదు. నా స్పందన పోస్ట్ చేసిన తర్వాత, 'పరిశీలించి ప్రచురించడం జరుగుతుం'దన్న మెసేజ్ కూడా కనిపించింది(actual wording నాకు గుర్తులేదు).అయినా సరే ఉద్దేశించినవారికి అది చేరకపోవడం ఆశ్చర్యకరంగానే ఉంది. సాంకేతికంగా ఇది ఎలా సాధ్యమో మీకు తెలిస్తే సందేహనివృత్తి చేయండి. లేదా ఈ పోస్ట్ చూస్తున్న పాఠకులలో(వీక్షకులు అనే మాట కన్నా ఇదే బాగున్నట్టుంది) సాంకేతిక నిపుణులు ఎవరైనా ఉంటే వారైనా సందేహనివృత్తి చేయగలరని కోరుతున్నాను. అందువల్ల ముందు ముందు జాగ్రత్త పడడానికి నా బోటి వాళ్ళకు అవకాశం ఉంటుంది.

    ReplyDelete
  8. శివరామప్రసాదు కప్పగంతుగారూ,
    2. "...I also do not wish to receive any further comments also from you...". నేను డిసెంబర్ 22,23 తేదీలలో మీ సాహిత్య అభిమాని బ్లాగ్ లో పోస్ట్ చేసిన నా వ్యాఖ్యలు మీకు చేరలేదనడం ఆశ్చర్యం కలిగిస్తే, మీరన్న పై మాట దిగ్భ్రాంతి కలిగించింది. అంటే, మీకు అనుకూలంగా లేని వ్యాఖ్యలను ఎవరైనా మీ బ్లాగ్ కు పోస్ట్(ఇప్పుడు నేను కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు)చేస్తే వాటిని క్యారీ చేయనని మీరు చెబుతున్నారు! చాలా దురదృష్టకరం. ఒకపక్క, మీడియా తనపై వచ్చే విమర్శలను సహించదనీ, అసహనాన్ని ప్రదర్శిస్తుందనీ ఉద్యమస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న మీరు మీ పరిమిత పరిధిలో అదే పని చేయడానికి సాహసించడం-నాకే కాదు, మీ వ్యాఖ్యలను గమనిస్తున్న పాఠకులందరికీ షాక్ కలిగిస్తుంది. మీడియాలో అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే, ఏదైనా సమాచారాన్ని, లేదా భిన్నాభిప్రాయాలను(అసభ్యత, అశ్లీలం, అన్ పార్లమెంటరీ వంటి ప్రచురణయోగ్యం కానీ మాటలు ఉంటే తప్ప)క్యారీ చేయమనడం, లేదా తొక్కిపెట్టడం వగైరాలను వృత్తిపట్ల దారుణ ద్రోహంగా, అనైతికంగా పరిగణిస్తారు. ఒక వైద్యుడు వైద్యం చేయననడం, ఒక న్యాయవాది వాదించననడం ఎలాంటివో ఇది కూడా అలాంటిదే. మీ ఈ వైఖరి వ్యక్తిగతంగా మీకు, మీ అభిప్రాయాలకే కాదు; మీరు విశ్వసించే భావజాలానికి(అది ఎలాంటిదైనా కావచ్చు గాక), వ్యవస్థలకు, సంస్థలకు కూడ గౌరవాన్ని. విలువను కలిగించదు. ఇంకొకరికి నీతులు చెప్పే నైతికాధికారాన్ని మీరు కోల్పోతారు. కనుక పునరాలోచించుకోండి.

    ReplyDelete
  9. శివరామప్రసాదు, కప్పగంతు గారూ,
    3. "as you are more combative than ready for discussion..." మీరన్న ఈ మాటల్లో రెండు అంశాలున్నాయి.(ఏ)"...more combative": అంటే నేను'ఘర్షణాత్మక'వైఖరిని తీసుకున్నాను కనుక నా తదుపరి కామెంట్లను స్వీకరించదలచుకోలేదని మీరంటున్నారు. ముందే చెప్పినట్టు, ఒకరి అభిప్రాయాలను స్వీకరించననీ, క్యారీ చేయననీ అనడానికి ఇది తగిన కారణం కాదు. అదలా ఉంచి, నా కామెంట్లలో ఘర్షణాత్మక ధోరణి ఉంటే గింటే అది మీ వైఖరికి ప్రతివైఖరి మాత్రమే(నవంబర్ 2012 లో నా kbhaskaram.blogspot.com లో నేను పోస్ట్ చేసిన కొన్ని రచనలపై శివరామప్రసాదు గారి వ్యాఖ్యలను నేరుగా చూడవలసిందిగా పాఠకులను కోరుతున్నాను). (బీ) "(you are not) ready for discussion": ఇక్కడ డిస్కషన్ అనడంలో 'మీడియా లోపాలు, లొసుగులపై విస్తృత చర్చ' అన్నది మీ ఉద్దేశం. ఆ విస్తృత చర్చతో నాకు సంబంధం లేదని నేను ముందే స్పష్టం చేసి, అందుకు కారణం కూడా చెప్పాను(సాహిత్య అభిమాని బ్లాగ్ లో డిసెంబర్ 19నాటి నా స్పందన చూడండి). మీకు అందలేదని చెబుతున్న డిసెంబర్ 22,23 తేదీలనాటి నా స్పందనలో దీనిపై మరింత వివరణ ఇచ్చాను. మన చర్చా పరిధి ఏమిటో, మీరు దానికి మాత్రమే ఎందుకు పరిమితం కావాలో-రెండు రెళ్ళు నాలుగు అన్నంత సూటిగా, స్పష్టంగా, సరళంగా, పాయింట్ బై పాయింట్ గా గుర్తుచేశాను. పక్కదారులు పట్టించే అనవసర విషయాలను పక్కన పెట్టి నేరుగా అసలు విషయంలోకి రండని మిమ్మల్ని కోరాను. ఆ పోస్ట్ లు మీకు చేరి, మీరు క్యారీ చేసి ఉంటే చర్చకు ఎవరు సిద్దం కావడంలేదో పాఠకులు స్వయంగా తెలుసుకునేవారు.
    ఇప్పుడు కూడా కొంప మునిగిందేమీ లేదు, నా దగ్గర హార్డ్ కాపీ ఉంది.

    ReplyDelete
  10. శివరామప్రసాదు కప్పగంతు గారూ,
    4. "OK. Whatever has happened has happened". అని మీరన్నారు. 'జరిగిందేదో జరిగింది' అంటూ ఫుల్ స్టాప్ పెట్టడం నాకూ సమ్మతమే. అయితే, మీరు అలా అంటూనే మళ్ళీ వక్రీకరణలకు పాల్పడుతున్నారు! నేను ఘర్షణాత్మకంగా ఉన్నాననీ, చర్చకు సిద్ధంగా లేననీ ఆరోపణ చేస్తున్నారు. "...since you are strongly feeling that I should not have referred to you in my article in my blog, I shall remove the introductory part". అన్న మీ వాక్యం వక్రీకరణకు ఒక ఉదాహరణ. ఇందులో 'ఫీలింగ్' అంటూ ఏమీలేదు. ఇది కేవలం 'ఫ్యాక్ట్' కు సంబంధించిన ప్రశ్న. మీ సాహిత్య అభిమాని బ్లాగ్ లో ఉంచిన వ్యాసంలో నేను అనని మాటలు నాకు ఆపాదించారు కనుక వాటిని ఉపసంహరించుకోమని అడిగాను. మీ వ్యాసంలో నా పేరు ఎందుకు ప్రస్తావించారని నేను అడగలేదు. తొలగించమని అంతకన్నా అడగలేదు.
    కనుక, 'జరిగింది ఏదో జరిగిపోయింది' అని నేను కూడా అనాలంటే ముందుగా మీరు మీ బ్లాగ్ లో డిసెంబర్ 22,23 తేదీలనాటి నా స్పందనను క్యారీ చేయడానికి ముందుకురండి. అందులో ఉన్న విషయాలు పాఠకులు తెలుసుకునే అవకాశం ఇవ్వండి. అవి మీకు అండడానికి వీలుగా తీసుకోవలసిన సాంకేతిక జాగ్రత్తలు ఏవైనా ఉంటే తెలియజేయండి. తర్వాతి విషయాలు తర్వాత...
    ఒకవేళ, 'జరిగింది ఏదో జరిగిపోయింది' అనే మీరు భావించి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదామన్నా నాకు అభ్యంతరం లేదు. అయితే, ఎటువంటి వక్రీకరణలు, ఆరోపణలు లేకుండా మీరు ఆమాట అనాలి.
    బంతి మీ కోర్టులోనే ఉంది...

    ReplyDelete