పాఠకులకు ఆలస్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతి పండుగకు బంధువుల ఊరికి వెళ్ళడం వల్ల నా బ్లాగ్ లో కొత్తవి ఏవీ పోస్ట్ చేయలేకపోయాను. అందుకే ఇలా ఆలస్యంగా శుభాకాంక్షలు.
కొన్ని మాసాలుగా నేను టీవీలో కానీ, థియేటర్లలో కానీ తెలుగు సినిమా కాదు కదా, ఏ సినిమా చూడలేదు. బంధువుల ఇంట్లో పండుగ రోజున అనుకోకుండా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాదరామన్న' సినిమా చూశాను. ఆశ్చర్యంతోపాటు ఆనందం కలిగింది. రాజమౌళి పేరు బాగా తెలుసు కానీ, ఆయన సినిమాలు ఏవీ నేను ఇంతవరకు సావకాశంగా చూడలేదు. 'మర్యాదరామన్న' సినిమా పేరు విన్నాను కానీ పేరును బట్టి అది చూడదగిన సినిమా అనిపించలేదు.
పని గట్టుకుని సినిమాకు వెళ్ళే అలవాటు నాకు తప్పిపోయి దశాబ్దాలు అయింది. నా వృత్తి కూడా అందుకు ఒక ముఖ్యమైన కారణం. ఎప్పుడైనా అనుకోకుండా టీవీలో సినిమాలు చూసే అనుభవం మాత్రమే నాది. టీవీలో టెలికాస్ట్ అయ్యేసరికి ఆ సినిమా పాతబడిపోతుంది కనుక ఆ సినిమాపై నా స్పందన కూడా చద్ది వాసన కొడుతుంది. కనుక నా నిస్సహాయతను పాఠకులు సహృదయంతో అర్థం చేసుకుని చద్ది వాసన కొట్టే నా స్పందనను సహిస్తారని ఆశిస్తున్నాను.
'మర్యాదరామన్న' చూశాక రాజమౌళిపై నాకు గౌరవం ఏర్పడింది. కథాంశం చిన్నది. పైగా కథానేపథ్యం బాగా నలిగిపోయిన రాయలసీమ ముఠాతగాదాలు. కానీ అద్భుతంగా, ఉత్కంఠభరితంగా కథను మలిచాడు. పాటలు కూడా కృతకంగా కాకుండా సందర్భంలో, సన్నివేశంలో చక్కగా ఒదిగిపోయాయి. కథ చెప్పడంలో రాజమౌళి తమిళ, హిందీ సినిమాల ఒరవడిని పాటించిన మాట నిజమే. అయితే ఆ ఒరవడిని సొంతం చేసుకుని సిద్ధహస్తత చాటాడు. క్రమంగా సొంత ముద్రను పెంచుకుంటూ తననుంచి కనీసం మరో పదేళ్లపాటు నాణ్యమైన సినిమాలు రాగలవన్న ఆశ కలిగించాడు. తెలుగు సినిమా స్థాయి పెరుగుతోందన్న భరోసా అందించాడు.
బహుశా హీరో ఓరియెంటెడ్ సినిమా దశనుంచి దర్శక ప్రాధాన్యం కలిగిన సినిమా దశకు తెలుగు సినిమా పయనిస్తోందన్న అభిప్రాయాన్ని రాజమౌళి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ల సినిమాలు కలిగిస్తున్నాయి. తెలుగు సినిమాకు ఇదొక శుభ సూచన.
ఎక్కువగా చూసే అవకాశం లేకపోవచ్చు కానీ, సినిమా నా అభిమాన విషయాలలో ఒకటి. కనుక సినిమా పై నా స్పందనలను ఎప్పుడైనా ఇలా మీతో పంచుకుంటూ ఉంటాను. ఏదైనా పాయింట్ ఉంటుందనిపిస్తే చదవండి, లేకపోతే వదిలేయండి.

No comments:
Post a Comment