భారతదేశానికి ఒక ఆత్మ అంటూ ఉందా?
పోనీ ఆత్మను నమ్మని వాళ్ళు ఉంటారు కనుక ఇదే ప్రశ్నను మరోలా వేసుకుందాం...
భారతదేశానికి ఒక హృదయమనేది ఉందా?
ఆత్మతో స్పందించి హృదయంతో మాట్లాడతారనుకునే కవులు, రచయితలూ కూడా ఫైవ్ స్టార్ సెట్టింగ్ లలో 'సాహిత్యోత్సవ్' లు జరుపుకోవడం చూస్తుంటే ఇలాంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. అనుమానంతోపాటు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అసలు ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా ఎలా వస్తాయనిపిస్తుంది.
అనేకానేక విధాలుగా క్షోభిస్తున్నఈ దేశం ఏ కారణంతో నైనా 'సెలెబ్రేట్' చేసుకునే ఘడియ వచ్చిందా? కామోత్సవ్ లా ఈ సాహిత్యోత్సవ్ ఏమిటి?
కిందటి నెలలో ఢిల్లీలో జరిగిన దారుణ మానభంగ ఘటన భారతీయ సమాజం ఆత్మను(పోనీ హృదయాన్ని) కుళ్లబొడిచిందనుకున్నాం. దానిపై భారతీయసమాజం మొత్తం ఒకే గుండెతో స్పందించిందనుకున్నాం. దేశం మొత్తంలో రోజుల తరబడి సంతాప వాతావరణం నెలకొందనుకున్నాం. ఆ వెంటనే వచ్చిన జనవరి 1 ఆర్భాటాలకు దూరంగా ఉండాలని కేంద్రం నిర్ణయించుకుని కొంత సున్నితత్వాన్ని చాటుకుంది.
అయితే, ఢిల్లీ మానభంగ ఘటన తర్వాత కూడా మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు, నాలుగేళ్ల పసి పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. పశువులు కూడా పాల్పడని అత్యంత హేయమైన చర్యలకు పాల్పడుతున్న మనుషులను పోల్చడానికి ఏ భాషలోనూ మాటలు దొరకని పరిస్థితిని చూస్తున్నాం.
మానభంగాల వంటి తీవ్రాతి తీవ్ర ఘాతుకాలే కాక ఈ దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఏటా జరిగినట్టే దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఉత్తరభారతంలోని మరికొన్ని చోట్లా ఈ ఏడాది కూడా చలి చావులు సంభవించాయి. అధికారికంగా ఆకలి చావులు లేవనుకున్నా అసంఖ్యాక జనం రోజూ అర్థాకలి చావులు చస్తూనే ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఉరితాళ్ళు పేనుకుంటూనే ఉన్నారు. గ్రామసీమలు పోషకాహార, పారిశుద్ధ్యలోపాలతో దరిద్రం ఓడుతున్నాయి. అనేక ఊళ్ళు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా లేక కళ్ళు తేలేస్తున్నాయి. ఆర్థిక వ్యత్యాసాల గండి రాకాసి ప్రమాణంలో పెరుగుతూనే ఉంది. అవినీతి కుంభకోణాలు పాము పుట్టల్లా బద్దలవుతున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లతో జైళ్ళు నిండిపోతున్నాయి...
ఇంతటి దుర్మార్గపు వ్యవస్థపై పిడుగులు కురిపించవలసిన కవి రచయితలు తమ కలాలనే వజ్రాయుధాలను జమ్మి చెట్టుకెక్కించి సాహిత్యోత్సవ్ లు జరుపుకోవడమా?! ఎంత ఆఘాయిత్యంగా ఉంది! అభ్యుదయం, ఆదర్శం ఏ ఆకర్షణల ఎండమావుల వెంట పడి గల్లంతైపోయాయి?
ఢిల్లీ యువతి మానభంగం, హత్య కలిగించిన శోకం నుంచి ఈ దేశం ఇంకా తేరుకొనే లేదు. సంతాప దినాలు పూర్తి కానేలేదు. హైదరాబాద్ లో లిటరరీ 'ఫెస్టివల్' నిర్వహించారు. విప్లవ,అభ్యుదయ,స్త్రీవాద కవులు కూడా పాల్గొన్నారు. నేటి నుంచీ జైపూర్ లో లిటరరీ 'ఫెస్టివల్' జరుగుతోంది. దేశ, విదేశీ కవులు, రచయితలు పాల్గొనబోతున్నట్టు సమాచారం.
సాహిత్య సమావేశాలు జరగవచ్చు, తప్పులేదు. కానీ వాటిని 'ఫెస్టివల్' అనడ మేమిటి? అలా అనడంలోని అనౌచిత్యం, అసంబద్ధత ఇంతమంది ఘనతవహించిన కవిపుంగవుల మెదళ్ళకు తట్టలేదా? చలన చిత్రోత్సవాలు, సంగీతోత్సవాలు జరుగుతున్నాయంటే వాటి దారి వేరు. కళా జగత్తుకు అంతటికీ తలమానికంగానే కాదు, తలగానూ ఉండవలసిన సాహిత్యం కూడా తలను తాకట్టు పెట్టేసి 'ఉత్సవ'మార్గం పట్టడమా?
వ్యవస్థాగత రుగ్మతలపై కసిగా కలాల కత్తులు నూరవలసిన మన కవి రచయితలు రసికరాజులుగా కూడా ఎలా మారారో చూడండి... సాహిత్యోత్సవ్ అన్నాక దానికి రంజైన కళాత్మక నేపథ్యం కూడా ఉండవలసిందే. 'పింక్ సిటీ'గా పేరున్న చారిత్రక నగరం జైపూర్ అయితేనే అందుకు భేషుగ్గా ఉంటుంది. ఆ ఫ్యూడల్ రాజాస్థానపు ఎరుపు రంగు కట్టడాలలో అదృశ్యంగా ఉన్న పరువు హత్యల నెత్తుటి చారికలు మన కవి రచయితల రసికనేత్రాలకు కనబడవు!
దేశం శాంతి సౌభాగ్యాలతో సుభిక్షంగా ఉందని చాటడానికీ, వాస్తవిక సమస్యలనుంచి జనం దృష్టిని మళ్లించడానికి ప్రభుత్వాలు ఇలాంటి ఉత్సవాలను జరపడమో ప్రోత్సహించడమో చేస్తుంటాయి. కవి రచయితలు కూడా ఆ వలలో చిక్కుకున్నారంటే అర్థమేమిటి? బహుశా ప్రభువులకు, కవులకు మధ్య అప్రకటిత అవగాహన ఏమైనా ఏర్పడిందా?
సామాజిక హితానికి అంకితమైన నేటి కాలపు కవులకు ఎవరికీ 'సెలెబ్రేట్' చేసుకునే అవకాశం వారి జీవిత కాలంలో రానే రాదు. అటువంటిది సాహిత్యోత్సవ్ ల పేరిట విజయనగర సామ్రాజ్యపు రోజులను ఆవిష్కరించే దశకు మన కవులు తిరోగమించడాన్ని ఏమనాలి?
ఇక్కడ కూడా గాంధీజీని ఒక బెంచ్ మార్క్ గా చెప్పుకోక తప్పడం లేదు. తనకు చిన్నప్పుడు నాటకాల మీద ఎంతో మక్కువ ఉండేదనీ, అయితే నా జీవితంలో వినోదాలు, వేడుకల అధ్యాయం నా పన్నెండేళ్ళ వయసుకే ముగిసిపోయిందనీ, ఆ తర్వాత నా జీవితంలోకి అవి ప్రవేశించలేదనీ, అందుకు అవకాశం కూడా లేకపోయిందనీ ఆయన ఆత్మకథలో రాసుకున్నారు.
ఇందుకు భిన్నంగా నేటి మన కవి రచయితలు ఏం చేస్తున్నారు? అభ్యుదయ యుగాన్ని స్వప్నించినవారే, అది సాకారం కాకుండానే తమ ఆదర్శాలను అటక ఎక్కించి ఉత్సవ మార్గంలో ఊరేగుతున్నారు!

No comments:
Post a Comment